Kaizer News

Hanamkonda: రాంనగర్ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు

Hanamkonda: రాంనగర్ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు శోభాయాత్ర, గోపూజ!

· State - Telangana · hmtvlive.com

Hanamkonda: హనుమకొండలో సెప్టెంబర్ 4వ తేదీన శ్రీకృష్ణాష్టమి వేడుకలు.కూడా మాజీ చైర్మన్, యాదవ వెల్ఫేర్ ట్రస్టు చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు. గొల్ల,కురుమల సమక్షంలో వేడుకలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన సుందర్ రాజ్ యాదవ్. యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ప్రెస్ మీట్ కామెంట్స్ప్ర. తీ ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నాం. యాదవ వంశానికి చెందిన శ్రీకృష్ణ భగవానుని వేడుకలు జరుపుకోవడం మా అదృష్టం. ప్రపంచ వ్యాప్తంగా శ్రీకృష్ణుని భజనలు జరుగుతున్నాయి. భగవద్గీత ప్రపంచానికి మార్గదర్శిగా మారింది, అన్ని దేశాల్లో భగవద్గీత పఠనం జరుపుతున్నారు, సెప్టెంబర్ 4న గొల్ల, కురుమలతో కలిసి వైభవంగా వేడుకలు నిర్వహిస్తాం. కాళోజీ కళాక్షేత్రంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలు ఉంటాయి. పార్టీలకు అతీతంగా వేడుక ఉంటుంది, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి,స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరవుతారు. శ్రీకృష్ణ తత్వాన్ని ప్రజలు అలవర్చుకోవాలి. సెప్టెంబర్ 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు రథయాత్ర. రాంనగర్ నుండి కాళోజీ కళాక్షేత్రం వరకు రథయాత్ర జరుగుతుంది. అనంతరం పవిత్రమైన గోవుల పూజ కార్యక్రమం, శ్రీకృష్ణ భగవానుని పూజ తొట్లు ఊపే కార్యక్రమం. యాదవ సంస్కృతి, సంప్రదాయాలు తెలిపే కార్యక్రమాలు. కళాకారుల ఆటా, పాట. అన్ని కులాలను ఈ వేడుకలకు ఆహ్వానిస్తున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికీ మార్గదర్శి. ఆయనను మనసులో నింపుకుని వేడుకలను విజయవంతం చేస్తాం. అందరి జీవితాలు సుఖ సంతోషాలతో, భగవంతుని ఆశీస్సులతో నిండాలని కోరుతున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న యాదవులను ఏకం చేసి రాబోయే రోజుల్లో వేడుకలు నిర్వహిస్తాం. మన కుటుంబ విలువలు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి. సమాజంలో భక్తిభావం, మంచిమార్గంలో నడిచేలా ప్రజలను నడిపించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం: సుందర్ రాజ్ యాదవ్. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News