సముద్ర జీవి అయిన జెల్లీ ఫిష్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాలు ఉన్నాయి. జెల్లీ ఫిష్ చేప కాదని, దాని శరీరంలో ఎక్కువ భాగం నీరేనని చాలామందికి తెలియదు. కొన్ని జాతులు విషపూరితమైనవి కాగా, మరికొన్ని చీకటిలో మెరుస్తాయి. అంతేకాదు, ‘ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్’గా పిలిచే ఓ జాతి తన జీవన దశను తిరిగి మార్చుకోగలగడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది