Kaizer News

జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శిగా విద్యా

జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శిగా విద్యాసాగర్ రెడ్డి

· State - Telangana · prabhanews.com

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శిగా టి. విద్యాసాగర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పవన్ కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ.. విద్యాసాగర్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో హ్యాండ్‌బాల్ క్రీడ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారికి అవసరమైన శిక్షణ, అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పవన్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా హ్యాండ్‌బాల్ అభివృద్ధికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యదర్శిగా ఎన్నికైన టి. విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో హ్యాండ్‌బాల్ క్రీడ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంగామోహన్ చక్రు, ట్రెజరర్ గట్టాడి రాజేష్, రాజ్‌కుమార్, సునీత, రమణ, శ్యామ్, అజ్మత్ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News