పరిగి: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని చింతల్ చెరువు సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. దోమ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ హయ్ గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తూ పరిగిలో నివాసముంటున్నాడు. చికిత్స నిమిత్తం పరిగి నుంచి ఖాజాబీ(65), జాంగీర్‌బీ(78), ఆఫాన్‌లు ఆయన వద్దకు వచ్చారు. రాత్రి తిరుగుప్రయాణంలో నలుగురూ కలిసి వెళ్తుండగా చింతల్ చెరువు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి బలంగా ఢీకొట్టాడు. కారులో ఉన్న ఖాజాబీ, జాంగీర్‌బీలు అక్కడిక్కడే మృతిచెందగా అబ్దుల్ హయ్, ఆఫాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఇరుక్కున్న అబ్దుల్ హయ్‌ను స్థానికులు అతికష్టంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం వికారాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) ABN రాధాకృష్ణని ఒక్కటే అడుగుతున్నా జోగి రమేష్ ఫైర్ నీకు టైం దగ్గర పడింది సాయిరెడ్డి... ఎవరిని చూసి రెచ్చిపోతున్నావో మాకు తెలుసు! సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. DMK స్టాలిన్ కు షాక్