Kaizer News

చెరుకుకు ప్రత్యామ్నాయం చక్కెర దుంప

చెరుకుకు ప్రత్యామ్నాయం చక్కెర దుంప

· State - Telangana · ntnews.com

బసంత్‌పూర్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో షుగర్‌ బీట్‌ అభివృద్ధి ఈ పంట అందుబాటులోకి వస్తే అన్నదాతలకు ఎంతో మేలు కొత్త రకం గోధుమ, చెరుకు వంగడాల అభివృద్ధి జహీరాబాద్‌, ఆగస్టు 30 : ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర ధర భారీగా పెరుగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు దానిని కొనలేని స్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో చెరుకుకు ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు, నిఫుణులు చక్కెర దుంప(షుగర్‌ బీట్‌) పంటను ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. దేశంలోని పంజాబ్‌, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల్లో ఈ పంటను పండించేందుకు అక్కడి రైతులను ప్రోత్సహిస్తున్నారు. చెరుకు పంట చేతికి రావాలంటే కనీసం ఏడాది పడుతుంది. పైగా నీళ్లు ఎక్కువగా అవసరం. తెగుళ్ల బెడద, క్రిమిసంహారాల ఖర్చు కూడా ఎక్కువే. చెరుకు సాగులో ఉన్న ఈ ఇబ్బందులను చక్కెర దుంప తీర్చనున్నది. ఈ పంట నాలుగు నెలల్లోనే చేతికొస్తుంది. ఎలాంటి నేలలోనైనా పండుతుంది. రాబడి ఎక్కువ, పెట్టుబడి తక్కువ. కాబట్టి రైతులను ఈ పంటవైపు మొగ్గు చూపేందుకు హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ వ్యవసాయ విశ్వవిద్యాయం శాస్త్రవేత్తలు, నిఫుణులు పరిశోధనలు చేపట్టారు. ఆయా రాష్ర్టాల మాదిరిగానే ఈ పంటను ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు అనువుగా ఉండే ప్రాంతాలను గుర్తించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం బసంత్‌పూర్‌ వ్యవసాయ పరిశోధనా కేంద్రంతోపాటు ఏపీలోని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఈ పంటను ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. చక్కెర దుంప చూడటానికి పాలకూర లాంటి ఆకులతో, ముల్లంగిని తలపించే ఆకృతితో ఉంటుంది. చెరుకు లాగానే దీనిలో కూడా సుక్రోజ్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ గుజ్జుని పాకం పట్టి చక్కెర తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చెరుకు పంట చేతికి రావాలంటే కనీసం ఏడాది పడుతుంది. తెగుళ్లు, క్రిమికీటకాల బెడద ఎక్కువ. ఎక్కువ నీళ్లు పెట్టాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఖర్చు ఎక్కువతోపాటు అనేక సమస్యలూ ఉంటాయి. ఈ పంట సమశీతోష్ణ వాతావరణంలో బాగా పండుతుంది. అయినప్పటికీ ఉష్ణమండల ప్రాంతాలకు సరిపోయే రకాలపై శాస్త్రేవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సాధారణంగా ఈ పంటకాలం సుమారు 120 రోజుల నుంచి 150 రోజులు ఉంటుంది. భూమిని లోతుగా దున్ని మెత్తగా చేసుకోవాలి. ఎకరానికి సుమారుగా 1 నుంచి 1.50 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తిన 3వ రోజున తొలి తడి ఇవ్వాలి. మొక్కల పెరుగుదల దశలో 10-15 రోజులకు ఒకసారి నీరు అందించాలి. పంట కోతకు 2-3 వారాల ముందే నీటితడులు ఆపేయాలి. సరైన యాజమాన్య పద్ధ్దతులు పాటిస్తే హెక్టార్‌కు 35 నుంచి 50 టన్నుల వరకు దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చెరుకు మాదిరిగానే ఈ దుంపల నుంచి మొలాసిస్‌, దాని నుంచి ఇథనాల్‌ తయారుచేస్తారు. వాటి వ్యర్థాలను బిల్డింగ్‌ మెటీరియల్‌గా వాడుకోవచ్చు. రోడ్ల నిర్మాణంలోనూ ఉపయోగిస్తున్నారు. ఇక దుంప నుంచి వచ్చిన పిప్పిని ప్రాసెస్‌ చేసి చెరుకుగా వాడుకుంటున్నారు. ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే దుంప ఆకులకు పశుగ్రాసంగా మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్నది. ఫార్మా, కాస్మోటిక్స్‌ రంగాల్లో దుంప చక్కెర వినియోగం పెరిగింది.

Original source: ntnews.com
Read more on Kaizer News