Kaizer News

నందం రామారావుకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పరామర్శ

నందం రామారావుకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పరామర్శ

· State - Telangana · prabhanews.com

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్, నవలా రచయిత నందం రామారావును అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), టీడీపీ నేత బత్తిన దాసు శనివారం పరామర్శించారు. నందం రామారావు కుమార్తె పద్మావతి (48) ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన కుటుంబం విషాదంలో ఉంది. ఈ నేపథ్యంలో రామారావును పరామర్శించిన వారు ఆయనకు మనోధైర్యం కల్పించారు. పద్మావతి మృతిపై వారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ దినపత్రిక ఆర్‌ఎం పి. హరిబాబు, కృష్ణా జిల్లా బ్రాంచ్ మేనేజర్ కొండవీటి సురేష్, కృష్ణా బ్యూరో చీఫ్ అంగడాల రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News