Kaizer News

గుండెనొప్పి త‌ట్టుకోలేక .. వృద్ధురాలి బలవన్మరణం

గుండెనొప్పి త‌ట్టుకోలేక .. వృద్ధురాలి బలవన్మరణం

· State - Telangana · prabhanews.com

ఎల్కతుర్తి, (ఆంధ్రప్రభ) : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌ గ్రామానికి చెందిన అబ్బనవేన ఎల్లమ్మ (75) మృతి చెందారు. కొంతకాలంగా ఆమె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల అనారోగ్యం తీవ్రం కావడంతో ఆయాసంతో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఎల్లమ్మ గురువారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను వరంగల్‌లోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అదే రోజు సాయంత్రం 6.50 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కుమార్తె ముల్కలపెల్లి స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్కతుర్తి ఎస్సై నరసింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News