Kaizer News

Ashes History | 144 ఏళ్ల నాటి ముచ్చట.. ఇంగ్లిష్ క్

Ashes History | 144 ఏళ్ల నాటి ముచ్చట.. ఇంగ్లిష్ క్రికెట్ చచ్చి ‘యాషెస్’ పుట్టింది ఈరోజే.. !

· Sports · ntnews.com

Ashes History : టెస్టుల్లో యాషెస్ సిరీస్ (Ashes Series) ఎంతో పాపులర్. యాషెస్ అంటే ‘బూడిద’ అని తెలిసిందే. మరి.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీగా సాగే యాషెస్‌కు అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలియాలంటే యాభై ఏళ్లు, వందేళ్లో కాదు ఏకంగా అంతకుమించి వెనక్కి వెళ్లాల్సిందే. 1882లో సరిగ్గా ఇదే రోజు అంటే.. ఆగస్టు 29వ తేదీన ఇంగ్లి్ష్ క్రికెట్ చచ్చిపోయి యాషెస్ పేరు పుట్టుకొచ్చింది. అంటే 144 ఏళ్ల క్రితం సంగతన్నమాట. ఇంతకూ ఆరోజు ఏం జరిగింది? ఎందుకీ యాషెస్‌ పేరు తెరపైకి వచ్చింది? అనేది చూద్దాం. క్రికెట్‌కు పుట్టినిల్లైన ఇంగ్లండ్ గడ్డపైనే యాషెస్ అనే పదం పురుడు పోసుకుంది. 1882 ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది ఆస్ట్రేలియా. ఆగస్టు 29న ఓవల్ మైదానంలో జరిగిన టెస్టులో ఆతిథ్య జట్టు బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ప్రత్యర్ధిని 84కు ఆలౌట్ చేసిన ఇంగ్లండ్ అలవోకగా గెలుస్తుందనిపించింది. అనుకున్నట్టే ఛేదనలో మెరుగ్గానే ఆడిన ఇంగ్లీష్ టీమ్ 51/2తో విజయం దిశగా సాగింది. కానీ, కంగరూ బౌలర్ స్పోఫోర్ట్‌ విజృంభించాడు. దాంతో.. అప్పటివరకూ పటిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లండ్‌ను దెబ్బతీసిన అతడు.. 44 పరుగులే ఇచ్చి ఏడు వికెట్లు తీశాడు. స్పోఫోర్ట్ సంచలన స్పెల్‌తో ఆతిథ్య జట్టు 77 రన్స్‌కే కుప్పకూలింది. ఈ ఘోర పరాజయంతోనే ఇంగ్లీష్ క్రికెట్ చచ్చిపోయింది అనే పోస్టర్లు వెలిశాయి. ‘ఓవల్ మైదానంలో 1882, ఆగస్టు 29వ తేదీన ఇంగ్లిష్ క్రికెట్ చచ్చిపోయింది. RIP. ఈ విషాదకరమైన వార్తను పంచుకునేందకు చింతిస్తున్నాం. ఇంగ్లిష్ క్రికెట్‌ను దహనం చేశాక.. ఆ బూడిదను ఆస్ట్రేలియా తీసుకెళ్తుంది’ అని యాన్ అఫెక్షనేట్ రిమెంబరెన్స్ పేరుతో ప్రచురించారు. అంతే.. అప్పటి నుంచి ఇరుదేశాల టెస్టు సిరీస్‌ను యాషెస్ సిరీస్ అని పిలవడం మొదలెట్టారు

Original source: ntnews.com
Read more on Kaizer News