Kaizer News

Nakrekal: ఘోర ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి లోయలోకి ప

Nakrekal: ఘోర ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి లోయలోకి పడ్డ బైక్.. యువకుడు మృతి!

· State - Telangana · hmtvlive.com

నకిరేకల్: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందుపట్ల సమీపంలోని బ్రిడ్జిపై అతివేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మల్ల సురేష్ (22) అనే యువకుడు మృతి చెందినట్లు సమాచారం. మృతుడు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమా.. లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో నకిరేకల్ సిఐ హరిబాబు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News