మన చేనేతల వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చీర అయినా, డ్రెస్ అయినా నేతకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న డిజైన్స్ ప్రత్యేకంగా కనువిందు చేస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు నేత చీరలు, డ్రెస్సులు పాతబడినా వాటి డిజైన్స్, జరీ జిలుగులు దూరం చేసుకోవాలనిపించదు. అలాంటప్పుడు వాటిని వివిధ రకాలుగా, తిరిగి వాడుకునేలా ఉపయోగించవచ్చు. మన చేతులతో నచ్చిన చేనేతల డిజైన్స్‌కు సరికొత్త అలంకారం తీసుకురావచ్చు. పాత చేనేత చీరలపైన ఉండే ఒరిజనల్ జరీ అంచులు, మోటిఫ్స్, నేతలో ఉండే డిజైన్స్ ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని తీసుకొని, లేస్‌తో జత చేసి, కుషన్ కవర్స్‌గా డిజైన్ చేయవచ్చు. పండగ వంటి ప్రత్యేక రోజుల్లో సంప్రదాయం ఉట్టిపడేలా లివింగ్ రూమ్ ఆకర్షణకు వీటిని ఉపయోగించవచ్చు. ఉపయోగించని పాత, చిరిగిన కాటన్ చేనేతలను తీసుకొని బాగున్న క్లాత్‌ను కట్ చేసి, విడిగా పెట్టాలి. వాటన్నింటిని ప్యాచ్ వర్క్ చేసి, క్విల్ట్‌ను రూ పొందించవచ్చు. ఈ క్రియేటివ్ క్విల్ట్ మెత్తగా, ఆకర్షణీయంగా వెలకట్టలేని జ్ఞాపకంగానూ మిమ్మల్ని మరింతగా ఆకట్టుకుంటుంది. చేనేత చీరల అంచులను టేబుల్ రన్నర్‌కి ఉపయోగించవచ్చు. సంప్రదాయ మోటిఫ్స్, సెంటర్ డిజైన్స్‌తో టేబుల్‌వేర్‌ని రూపొందించవచ్చు. బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) చెల్లి సమాధి సాక్షిగా.. యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య YSR మేనత్త కమలమ్మ కన్నుమూత.. నివాళులర్పించిన YS భారతి రెడ్డి లడ్డూ నెయ్యి వివాదంలో కీలక ట్విస్ట్.. జంతు కొవ్వుపై దర్యాప్తులో క్లారిటీ ది ప్యారడైజ్ సెన్సార్ రిపోర్ట్ ఇదే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!