ఆడబిడ్డల పెళ్లికి వరంలాంటి పథకం.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందిస్తామని వెల్లడి భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పిప్రి (జె) గ్రామ సర్పంచ్ అరిగెల జనార్ధన్ అన్నారు. గ్రామంలో శనివారం కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం చెక్కులు ఆగిపోయాయంటూ కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. ఆడబిడ్డల పెళ్లికి ఆర్థికంగా అండగా నిలిచే ఈ పథకం నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన నిరుపేద కుటుంబాలకు తప్పకుండా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని జనార్ధన్ అన్నారు. కల్యాణలక్ష్మితో పాటు అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జితేందర్, జీపీ ఓ గంగాధర్, ఉపసర్పంచ్ రంజిత్, జేమ్స్, పల్లె శ్రీనివాస్, వీడీసీ సభ్యులు, మండల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాజేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు నారాయణ, మహిపాల్, స్వామి, గంగారం తదితరులు పాల్గొన్నారు