స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవాలు వద్దు, పోరాడి గెలవాలని అనూష పిలుపునిచ్చారు. కార్యకర్తలే నాన్నను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని, అదే అభిమానం కోరారు. గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలు వివరించాలన్నారు. భీమిలి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది, కొత్త పోరు మొదలైంది. AP Local Body Elections | చీపురుపల్లి: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష చేసిన తొలి ప్రసంగం పార్టీ కార్యకర్తలతో పాటు నేతల్ని ఆకట్టుకుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలు అనే మాట వినిపించొద్దని, పోరాటం చేసి విజయం సాధిద్దామని వైసీపీ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఇకనుంచి బొత్స 1.0 కాదు బొత్స 2.0 చూస్తారంటూ కార్యకర్తల్లో జోష్ తీసుకొచ్చారు. వైసీపీ సమావేశంలో బొత్స అనూష చేసిన ప్రసంగంతో ఇటీవల వరుస సమావేశాల్లో కన్నీళ్లతో కనిపించిన బొత్స సత్యనారాయణ కళ్లల్లో ఆనందం కనిపించింది. తన నాన్నగారిని ఇక్కడి ప్రాంతం నుంచి ఎంపీగా దేశస్థాయికి పంపించి, బొత్స అనే బ్రాండ్‌ను ఆల్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లింది పార్టీ కార్యకర్తలేనని అన్నారు. గతంలో తమ తల్లిదండ్రులకు కార్యకర్తలు ఏ విధంగానైతే ఆత్మీయతను, అభిమానాన్ని చూపించారో, అదే అభిమానాన్ని తనకు, తన తమ్ముడికి కూడా చూపించాలని ఆమె అభ్యర్థించారు. ఇదే సమయంలో చంద్రశేఖర్ (పెద్దబాబు) గురించి మాట్లాడుతూ.. ఒక సామాన్య కార్యకర్తగా ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు ఎదిగారని పేర్కొన్నారు. పార్టీలో జిల్లాకు పెద్ద దిక్కు పోయారని అనుకుంటున్న తరుణంలో చంద్రశేఖర్ ఆ స్థానాన్ని భర్తీ చేశారన్నారు. కార్యకర్తలు అంటే ఎవరూ ఆశామాషీగా తీసిపారేయడానికి వీల్లేదని, రేపు పొద్దున్న ఏదైనా సాధించి శాసించేది కార్యకర్తలేనని ఆమె గుర్తుచేశారు. ఏకగ్రీవాలు కాకుండా పోటీకి సిద్ధం దౌర్జన్యాలను అడ్డుకోవడంలో కార్యకర్తలతో సమానంగా సోషల్ మీడియా వారియర్స్ ఎంతో శ్రమిస్తున్నారని, వారి పోరాటం వల్లే మనం దౌర్జన్యాలను ఎదిరించగలుగుతున్నామని బొత్స అనూష పేర్కొన్నారు. అందువల్ల సోషల్ మీడియా వారియర్స్ అందరికీ చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వైఎస్ జగనన్న ఇచ్చిన పిలుపును గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ఎక్కడా ఏకగ్రీవాలు కాకుండా, ప్రతి చోటా పోటీకి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలందరూ ఇదే ఉత్సాహంతో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను పలకరించాలని, సూపర్ సిక్స్ వైఫల్యాలను ఎత్తి చూపాలని పిలుపునిచ్చారు. ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మలను కలిసి "మీకు సిలిండర్లు వచ్చాయా? ఎన్ని ఇచ్చారు?" అని అడిగి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. అలాగే వృద్ధులను కలిసి కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు, వచ్చాయా అని ప్రజా సమస్యలపై స్పందించాలని బొత్స అనూష పిలుపునిచ్చారు. ుగా మారిన భీమిలి.. భీమిలి రాజకీయ వాతావరణం వేడెక్కినట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వర్సెస్ బొత్స సత్యనారాయణగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. భీమిలి వైసీపీ ఇన్‌ఛార్జీగా బొత్స అనూష నియామకంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బొత్స అనూషకు పోటీగా గంటా శ్రీనివా