కాలంతో పాటు పండగు చేసే కల్చర్ కూడా మారుతూ వస్తోంది.. ఈ మధ్య కాలంలో చాలా మంది వినాయక మండపాల్లోని గణనాథుడికి నోట్ల కట్టలతో చేసిన దండలను అలంకరిస్తున్నారు. కానీ దొంగలు వాటిని కూడా వదలట్లేదు.. తాజాగా చెన్నైలోని ఓ వినాయక మండపంలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. గణనాథుడి మెడలో ఉన్న రూ.10వేల విలువైన నోట్ల దండను ఎత్తుకెళ్లారు కొందరు దుండగులు. ఇక నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం ఆరుగురి నిందితులను అరెస్ట్ చేశారు