ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని పోచమ్మ తల్లి ప్రధాన దేవాలయంలో బోనాల ఉత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవం ప్రారంభం కావడంతో ఆలేరు పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారి నామస్మరణలు, భక్తుల రాకపోకలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి