Kaizer News

స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు.. వీరికి పట్టింది బంగ

స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు.. వీరికి పట్టింది బంగారమే

· State - Telangana · tv9telugu.com

శుక్రుడు ఐశ్వర్యాలు భోగభాగ్యాలకు కారకుడు. అయితే త్వరలో శుక్రుడు స్వాతి నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడంట. దీని వలన మూడు రాశుల వారికి పట్టిది బంగారమే ముట్టింది ముత్యమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం. కుంభ రాశి : కుంభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో వారికి ఇది మంచి సమయం. అన్ని విధాలుగా వీరికి చాలా ప్రయోజనకరంగా ఉండనుంది. ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవి వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అంతే కాకుండా సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది మకర రాశి : మకర రాశి వారికి చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. అంతే కాకుండా కుటుంబంలో సంతోషం నెలకుంటుంది. పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. అన్ని విధాలుగా వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పవచ్చును. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Original source: tv9telugu.com
Read more on Kaizer News