Kaizer News

Khammam | సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు అండగా పు

Khammam | సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు అండగా పువ్వాడ.. మేమున్నామంటూ భరోసా..!

· State - Telangana · ntnews.com

Khammam : కాంగ్రెస్ నాయకుల బెదిరింపులతో ‘సొంత ఊరు విడిచి వెళ్తున్నా’ అంటూ పోస్ట్ పెట్టిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండగా నిలిచారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ నేతలకు భయపడొద్దని, అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించాలని ఆయన సూచించారు. అతడికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు పువ్వాడ. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నేతల బెదిరింపులకు గురైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భరోసానిచ్చారు. ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ప్రశ్నించాలని సదరు వ్యక్తికి ఆయన సూచించారు. ఆదివారం బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల సమక్షంలో ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు తాను, గులాబీ పార్టీ అండగా ఉంటుందని పువ్వాడ వెల్లడించారు. ఇటీవల ఖమ్మం శ్రీనివాస నగర్‌లో పేదల ఇళ్లను కూల్చడాన్ని చూస్తూ ఉండలేక వీడియోలు తీసి ఇన్‌ఫ్లూయెన్సర్ తన సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ పోస్ట్‌లు చూసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు అతడిని బెదిరించారు. దీంతో సొంత ఊరు వదిలేసి వెళ్లిపోతున్నాను అంటూ ఆవేదనతో సదరు ఇన్‌ఫ్లూయెన్సర్ వీడియో పోస్ట్ చేశాడు. అన్యాయాన్ని ప్రశ్నించిన అతడికి తాము అండగా ఉంటామని, భయపడకుండా ప్రశ్నించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు పువ్వాడ అజయ్ కుమార్ అండ ఖమ్మం శ్రీనివాసనగర్‌లో పేదల ఇళ్లు కూల్చుతున్నారని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ను బెదిరించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు దీంతో సొంత ఊరు వదిలేసి… https://t.co/LGmU4eJS3N pic.twitter.com/FCNmsgu5ys

Original source: ntnews.com
Read more on Kaizer News