Kaizer News

Adilabad: ప్రకృతి పూజతోనే సంస్కృతి పరిరక్షణ: కలెక్

Adilabad: ప్రకృతి పూజతోనే సంస్కృతి పరిరక్షణ: కలెక్టర్ రాజర్షిషా!

· State - Telangana · hmtvlive.com

Shorts ఆదిలాబాద్: వినాయక నవరాత్రుల సందర్భంగా శుక్రవారం భోరాజ్ మండలం రాంపూర్(టి) గ్రామంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్న ఆయన, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం మండపంలో 2,100 దీపోత్సవ వేడుకలను మొదటి జ్యోతి వెలిగించి ప్రారంభించి, గ్రామ ప్రజలతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాంపూర్ గ్రామంలో ఇంత ఘనంగా, నిష్టతో గణేష్ ఉత్సవాలు జరగడం అభినందనీయమని కొనియాడారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం మన సంప్రదాయమని, ఇదే స్ఫూర్తిని జిల్లాలోని మిగతా గ్రామాలు సైతం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి యంత్రాంగం తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, మంచి సంకల్పంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News