Kaizer News

ఒకేరోజు ఐదు షాక్‌లు!.. పోలీసు చర్యలపై రేవంత్‌కు వర

ఒకేరోజు ఐదు షాక్‌లు!.. పోలీసు చర్యలపై రేవంత్‌కు వరుస ఎదురుదెబ్బలు

· State - Telangana · ntnews.com

కేటీఆర్‌ పీఆర్వో మహేశ్‌, బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌ రిమాండ్‌ ప్లాన్‌ విఫలం దానం అనర్హతతో జంపింగ్‌లకు చెక్‌ ఎర్రవెల్లి వైపు కాంగ్రెస్‌ రాజకీయ దండయాత్ర .. కానీ, ఎదురైనది భారీ పోలీసు బందోబస్తే ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌లో ఇండ్లు తొలగించవద్దని హైకోర్టు ఆదేశం బీఆర్‌ఎస్‌ విజయంగా అభివర్ణన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి సర్కార్‌కు శుక్రవారం ఒకే రోజు ఐదు ఎదురుదెబ్బలు తగిలాయి. కేటీఆర్‌ పీఆర్వో మహేశ్‌తోపాటు బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలన్న రేవంత్‌ ప్లాన్‌ విఫలమైంది. వారికి రిమాండ్‌ అవసరం లేదని న్యాయస్థానాలు చెప్పడంతో ప్రభుత్వం నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. మరోవైపు, పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో పార్టీ ఫిరాయించిన మరో ఎనిమిది మందిలో భయాందోళన మొదలైంది. ఎర్రవెల్లి వైపు రాజకీయ దండయాత్ర తలపెట్టిన కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలకు భారీ పోలీసు బందోబస్తు మాత్రమే ఎదురైంది. ఆశించిన ఏదో ఫలితం రాకుండానే పథకం ఎదురుతన్నింది. ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌లో పేదల ఇండ్లను కూల్చవద్దని బీఆర్‌ఎస్‌ చేస్తున్న పోరాటానికి న్యాయస్థానంలో మద్దతు లభించింది. శ్రీనివాసనగర్‌లోని ఇండ్లను కూల్చవద్దని హైకోర్టు ఆదేశించడం కాంగ్రెస్‌ సర్కార్‌కు చెంపపెట్టుగా మారింది. ఈ పరిణామాలను రేవంత్‌ ప్రభుత్వానికి ఒకేరోజు ఐదు వరుస ఎదురు దెబ్బలుగా బీఆర్‌ఎస్‌ నేతలు అభివర్ణించారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ ఇంటి వద్ద శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు భారీగా మోహరించడం మరో వివాదానికి దారితీసింది. సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన కేసుకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు మొదట నోటీసు ఇవ్వడానికి వచ్చామని చెప్పి, అనంతరం ఇం టి తలుపులు, గేటు బద్దలు కొట్టి మరీ క్రిశాంక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన క్రిశాంక్‌ భార్య, బిడ్డ ఏడుస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. క్రిశాంక్‌ కుటుంబంపై ప్రభుత్వ, పోలీసుల దమనకాండ తీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. న్యాయస్థానంలో క్రిశాంక్‌ను హాజరుపరిచిన పోలీసులు 14 రోజులపాటు రిమాండ్‌ విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఏడేండ్లకు పైబడిన శిక్షకాదు కాబట్టి రిమాండ్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. క్రిశాంక్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టుపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులపై రెచ్చగొట్టే, తప్పుడు సమాచారం ప్రచారం చేశారన్నది ఫిర్యాదుదారుల ఆరోపణ. అయితే, తాను పోలీసులపై సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు వెనుక ఉన్న అంశాలు సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఘటనలకు సంబంధించినవేనని క్రిశాంక్‌ తెలిపారు. ఆ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పార్టీ ఫిరాయింపు కేసును విచారించిన హైకోర్టు.. ఆయనను అనర్హుడిగా ప్రకటించడం రేవంత్‌ ప్రభుత్వానికి రాజకీయంగా తీవ్ర ఎదురుదెబ్బగా మారింది. ఈ తీర్పుతో ఇప్పటికే పార్టీ ఫిరాయి

Original source: ntnews.com
Read more on Kaizer News