కర్నూలు: బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని, గృహనిర్మాణం, విద్యా రుణాలు, ఎంఎస్ఎంఈ, వ్యవసాయ మౌలిక వసతులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో రుణాల లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి బ్యాంకు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో బ్యాంకర్లకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (DCC) సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా రుణాల విషయంలో బ్యాంకులు మరింత చొరవ చూపాలన్నారు. అర్హులైన విద్యార్థులకు సకాలంలో రుణాలు అందించాలని కలెక్టర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ రంగంలో సాధన కేవలం 12.45 శాతం మాత్రమే ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పెండింగ్‌లో ఉన్న రుణ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి లక్ష్యాలను మెరుగుపరచాలన్నారు. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన రంగంలో కూడా రుణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని కలెక్టర్ పేర్కొంటూ, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రుణాల మంజూరును వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో లోన్లకు సంబంధించి అధిక లక్ష్యాలు ఉన్నప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 49 శాతం లక్ష్యాలను సాధించారని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులు లక్ష్య సాధనలో మరింత చొరవ చూపి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో వచ్చే త్రైమాసికంలో మెరుగైన పురోగతి సాధించాలన్నారు.. జిల్లా ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలో ఎంఎస్ఎంఈ రంగం కీలక పాత్ర పోషిస్తుందని, అందువల్ల జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రుణాల పంపిణీలో బ్యాంకులు మరింత చురుకుగా వ్యవహరించి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎంఎస్ఎంఈ రుణాల లక్ష్య సాధనలో మెరుగైన పనితీరు కనబరుస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇతర బ్యాంకులు కూడా ఎస్‌బీఐ అనుసరిస్తున్న విధానాలు, కార్యాచరణ ప్రణాళికలను అధ్యయనం చేసి లక్ష్య సాధనకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంఎస్ఎంఈ రుణాల లక్ష్య సాధనలో కేవలం 11 శాతం ప్రగతిలో ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్ చివరి నాటికి కనీసం 50 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. రైతులు గత కొంతకాలంగా సాగునీటి సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి పశుపోషణ మంచి ప్రత్యామ్నాయ జీవనోపాధిగా ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులు, లబ్ధిదారులకు పశుపోషణ యూనిట్ల కోసం ఎక్కువ సంఖ్యలో రుణాలు మంజూరు చేసి రైతులకు అండగా నిలవాలన్నారు.. పశుసంవర్ధక యూనిట్లకు బీమా ఎంతో ముఖ్యమని, ప్రతి యూనిట్‌కు బీమా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పీఎం విశ్వకర్మ కార్యక్రమం కింద పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారుల రుణ దరఖాస్తులను సెప్టెంబర్ నెలాఖరులోగా పరిష్కరించి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. ముద్ర రుణాల కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాల