Kaizer News

జనగణన ప్రశ్నల్లో ఓబీసీ కాలం చేర్చాల్సిందే..బీసీలపై

జనగణన ప్రశ్నల్లో ఓబీసీ కాలం చేర్చాల్సిందే..బీసీలపై కేంద్రం వివక్షను విడాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్

· State - Telangana · v6velugu.com

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో ఓబీసీ కాలం పెట్టి తీరాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్‌‌‌‌ చేశారు. ఆదివారం కర్నాటక బీదర్‌‌‌‌‌‌‌‌లో బీసీ సంఘాలు, ఈడిగ సంఘాల ఆధ్వర్యంలో సామాజిక తత్వవేత్త, సంఘ సంస్కర్త బ్రహ్మశ్రీ నారాయణ గురు, కర్నాటక బీసీ నేత దేవరాజ్ అరసు జయంతి కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభకు కర్నాటక పీసీసీ చీఫ్ బీకే హరిప్రసాద్, పంచాయతీ రాజ్ మంత్రి ఈశ్వర్ కాండ్రే, ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కేసన శంకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి తమ జీవితాలను పణంగా పెట్టిన మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలను కేంద్ర ప్రభుత్వం లెక్కించడానికి భయపడుతుందని మండిపడ్డారు. బీసీ లెక్కలు తేలితేనే బీసీల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని, చట్టబద్ధమైన హక్కులు ఒక హక్కుగా దక్కుతాయన్నారు. బీసీలపై కేంద్రం వివక్షను వీడి, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై దేశవ్యాప్తంగా ఉద్యమించడానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే నెల 20న హైదరాబాద్‌‌‌‌లో జాతీయ ఓబీసీ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని, 29 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన వెల్లడించారు

Original source: v6velugu.com
Read more on Kaizer News