Kaizer News

Chandragiri: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్ర

Chandragiri: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్

· State - Telangana · hmtvlive.com

Shorts చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు సమస్యలు లేకుండా చూడాలన్నదే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం: ఎమ్మెల్యే పులివర్తి నాని. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం : ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి రూరల్ మండలం రఘునాథ రిసార్ట్స్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ప్రజా సమస్యలతో వచ్చిన ప్రజలను నేరుగా కలుసుకొని వారి సమస్యలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే. అందులో కొన్ని సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి సత్వరం పరిష్కారాన్ని చూపాల్సిందిగా తెలియజేశారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి , ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్న ఎమ్మెల్యే పులివర్తి నాని

Original source: hmtvlive.com
Read more on Kaizer News