Burning Topic: ప్రపంచ చమురు రంగంలో సంచలనం చోటు చేసుకుంది. వెనెజువెలాకు చెందిన సుమారు 65 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలను స్వాధీనం చేసుకునేలా ఈ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్‌తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ జరిగిన చర్చల అనంతరం ఈ భారీ ఒప్పందం ఖరారైందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ట్రంప్. వె వారాలపాటు కొనసాగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరిందన్నారు. అమెరికా పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం లేకుండానే ఈ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఇంధన ఒప్పందం అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం వల్ల అమెరికా చమురు నిల్వలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరుగుతాయని చెప్పారు. దేశీయంగా చమురు సరఫరా గణనీయంగా పెరగడంతో భవిష్యత్తులో గ్యాసోలిన్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని మార్కో రూబియో తెలిపారు. అమెరికాకు స్థిరమైన, తక్కువ ధరకు ముడి చమురు లభించే అవకాశం ఉంటుందని, తద్వారా పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. వెనెజువెలాలో దాదాపు 100 బిలియన్ డాలర్ల మేర ప్రైవేటు పెట్టుబడులు రావచ్చని, వేలాది అధిక వేతన ఉద్యోగాలు ఏర్పడటంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. కాగా 65 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలపై అమెరికాకు నియంత్రణ ఏ విధంగా లభిస్తుంది? అసలు ఈ ఒప్పందం ఏ రూపంలో అమలు కానుందనే స్పష్టత ఇవ్వలేదు. ఏ చమురు క్షేత్రాలు ఇందులో భాగం కానున్నాయి? ఏ కంపెనీలు పాల్గొంటాయి? ఒప్పందానికి సంబంధించిన చట్టబద్దత, పెట్టుబడుల విధానం, చమురు క్షేత్రాల ఎంపిక స్పష్టమైన తర్వాతే ఈ డీల్ ప్రభావం ఎంత ఉంటుందో అంచనా వేయగలమని నిపుణులు చెబుతున్నారు. వెనెజువెలా చమురు రంగం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో కన్నేశారు. 1999లో వెనెజువెలాలో అధికారంలోకి వచ్చిన హ్యూగో చావెజ్ ఆ దేశంలోని చమురు కంపెనీలన్నింటినీ జాతీయం చేశారు. ఈ నిర్ణయం అమెరికాను ఆర్థికంగా, రాజకీయంగా పెద్ద దెబ్బ తింది. అమెరికా చమురు కంపెనీలు వెనెజువెలాలో వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. జాతీయం చేయడం వల్ల తమ బిలియన్ల డాలర్ల ఆస్తులను, చమురు బావులను రాత్రికి రాత్రే కోల్పోయాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెనిజువెలా చమురు పరిశ్రమను అమెరికా కంపెనీలకు తిరిగి అప్పగించాలనే ప్రతిపాదనను తీసుకొచ్చారు. వెనెజువలా అధ్యక్షుడు నికొలస్ మదురో అమెరికా అధ్యక్షుడిని మొదటి నుంచి లెక్క చేయలేదు. దీంతో ఈ ఏడాది జనవరి 3వ తేదీన నార్కోటెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలపై వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య జరిపి మదురోను అరెస్టు చేసి తమ దేశానికి తరలించింది. నికొలస్ మదురోను సైనిక చర్య అధ్యక్ష ద్వారా పదవి నుంచి తొలగించిన తర్వాత వెనెజువెలా చమురు రంగంపై అమెరికా దృష్టి మరింత పెరిగింది. అమెరికా రిఫైనరీలకు స్థిరమైన ముడి చమురు సరఫరా ఉండేలా చూడటంతోపాటు అమెరికా కంపెనీల పెట్టుబడులను ప్రోత్సహించే ప్