Kaizer News

Anakapalli: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో క్రిటికల

Anakapalli: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ సేవలు

· State - Telangana · hmtvlive.com

Shorts అనకాపల్లి: జిల్లా ప్రజలకు అత్యవసర వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ విభాగాన్ని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా క్రిటికల్ కేర్ విభాగంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, వైద్య పరికరాలు, అత్యవసర చికిత్సకు సంబంధించిన సదుపాయాలను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయ కృష్ణన్ పరిశీలించారు. విభాగం ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు క్రిటికల్ కేర్ విభాగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన అనంతరం అతి త్వరలోనే ఈ విభాగాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి వస్తే అనకాపల్లి జిల్లా ప్రజలకు అత్యవసర వైద్యంలో మరింత మెరుగైన సౌకర్యాలు లభించనున్నాయి. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు సకాలంలో చికిత్స అందించేందుకు ఈ విభాగం కీలకంగా మారనుందని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్, జిల్లా వైద్యాధికారి, హాస్పిటల్ వైద్యులు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News