Madanapalle: ఈ నెల 30న ఆదివారం అన్నమయ్య జిల్లాలో మదనపల్లె (మిట్స్, ఆదిత్య), రాయచోటి (శ్రీ సాయి, భాస్కర్) ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాల్లో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.30 వరకు నీట్ - పీజీ పరీక్ష జరుగుతుంది; ఉదయం 8.30 గంటల తర్వాత ఎవరినీ అనుమతించరు. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల చుట్టూ 200-300 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుంది; ఆ పరిధిలోని జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలి. కేంద్రాల్లోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నిషేధం, పేపర్ లీక్ వదంతులు సృష్టించినా, అక్రమాలకు పాల్పడినా కఠిన క్రిమినల్ చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు