Kaizer News

భూభారతి రీ-సర్వేపై రైతులకు అవగాహన..

భూభారతి రీ-సర్వేపై రైతులకు అవగాహన..

· National - India · prabhanews.com

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : భూ భారతి రీ-సర్వేలో భాగంగా తమ భూములకు సంబంధించిన వివరాలను రైతులు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, వివరాల్లో ఏవైనా తేడాలు లేదా అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద సూచించారు. నల్లబెల్లి మండలం అర్షనపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన భూభారతి రీ-సర్వే గ్రామ సభలో ఆమె పాల్గొని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రీ-సర్వే ప్రక్రియ, భూ వివరాల నమోదు, సర్వే సమయంలో భూ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రీ-సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్‌ వివరించారు. రీ-సర్వే ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామస్థులు అధికారులకు సహకరించాలని కోరారు. తమ భూములకు సంబంధించిన రికార్డులు, వివరాలను పరిశీలించుకుని ఏవైనా పొరపాట్లు ఉంటే సకాలంలో తెలియజేయాలని సూచించారు. గ్రామ సభలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, ఏడీ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారి శ్రీనివాసులు, నల్లబెల్లి తహసీల్దార్‌ కృష్ణ, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News