Kaizer News

అమ్మకు గాంధీ దవాఖాన పునర్జన్మ..అరుదైన గుండె జబ్బుత

అమ్మకు గాంధీ దవాఖాన పునర్జన్మ..అరుదైన గుండె జబ్బుతో చేరిన గర్భిణికి సిజేరియన్

· State - Telangana · v6velugu.com

పద్మారావునగర్, వెలుగు: అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ గర్భిణికి గాంధీ దవాఖాన డాక్టర్లు విజయవంతంగా సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించారు. శాలిబండకు చెందిన 22 ఏండ్ల హీనా బేగంకు పెరిమెంబ్రానస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ అనే అరుదైన గుండె జబ్బుతో బాధపడుతోంది. ఇది గుండెలోని కింది రెండు గదులను వేరుచేసే గోడ పైభాగంలో పుట్టుకతోనే ఏర్పడే ఒక రంధ్రం. గుండె ఎడమ వైపు రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. ఈ రంధ్రం ఉండడం వల్ల ఆక్సిజన్ ఉన్న మంచి రక్తం శరీరానికి వెళ్లడానికి బదులుగా ఎడమ వైపు నుంచి కుడి వైపునకు..అక్కడి నుండి ఊపిరితిత్తుల్లోకి ప్రవహిస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తులతో పాటు గుండెపై అదనపు భారం పడుతుంది. ఈ రంధ్రానికి సరైన ట్రీట్​మెంట్​చేసుకోకపోవడం వల్ల తీవ్రమైన గుండె, ఊపిరితిత్తుల సమస్య (ఐసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిండ్రోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ) ఏర్పడింది. రక్తం ప్రవహించే దిశ మారి శరీరానికి ఆక్సిజన్ లేని చెడు రక్తం సరఫరా అవుతోంది. అంతేగాకుండా టీఆర్, ఎంఆర్ అనే సమస్యలు కూడా వచ్చి పడ్డాయి. దీనివల్ల గుండెలోని రక్తనాళాల కవాటాలకు లీకేజీ సమస్యలు ఏర్పడ్డాయి. సాధారణంగా గర్భిణుల్లో లక్ష మందిలో కేవలం ఇద్దరిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధిని గర్భం దాల్చిన 12వ వారంలోనే గాంధీ దవాఖాన డాక్టర్లు గుర్తించి అప్పటి నుంచే స్పెషల్​ట్రీట్​మెంట్​స్టార్ట్​చేశారు. రెండో యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ రిస్క్​ను అంచనా వేశారు. కాన్పు గడువు దగ్గర పడడంతో హాస్పిటల్​లో అడ్మిట్​చేసుకున్నారు. గైనకాలజీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జానకి, ఆమె టీం కార్డియాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్​కచ్చితంగా పాటిస్తూ ఈ నెల 3న సిజేరియన్ చేయగా.. 2.3 కిలోల బరువుతో ఆరోగ్యకరమైన మగ బిడ్డ పుట్టాడు. ఆపరేషన్​తర్వాత తల్లికి ఏం కాకుండా ఉండేందుకు ఇద్దరినీ ఐసీయూలో పెట్టారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో 17న డిశ్చార్జి చేశారు. క్లిష్టమైన కేసును విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జానకి, ఆమె టీంను డీఎంఈ డాక్టర్ వాణి, గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తోట ఉషారాణి అభినందించారు

Original source: v6velugu.com
Read more on Kaizer News