Kaizer News

Bhadradri Kothagudem Crime News: ఇద్దరితో మహిళ ఎఫై

Bhadradri Kothagudem Crime News: ఇద్దరితో మహిళ ఎఫైర్.. కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తి దారుణ హత్య.. ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పు

· State - Telangana · telugu.abplive.com

బూర్గంపాడు: వివాహేతర సంబంధాలు ఆత్మహత్యలతో పాటు హత్యలకు దారితీస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వ్యక్తుల జీవితాలతో పాటు ఆ కుటుంబసభ్యుల జీవితాలు నాశనం అవుతున్నా, అనైతిక బంధాల కోసం పాకులాడుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి చెందిన జింకలగూడెం గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగి ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఒకే మహిళతో ఇద్దరు వ్యక్తులు అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యవహారం తీవ్ర విషాదానికి కారణమైంది. కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. మౌలానా (42), ఇస్మాయిల్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఆమె జోలికి నువ్వు రావొద్దు అంటే నువ్వే ఆమెను వదిలెయ్ అంటూ వారిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మౌలానాపై తీవ్ర పగ పెంచుకున్న ఇస్మాయిల్, అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. తన ప్లాన్‌లో భాగంగా ఇస్మాయిల్ తన కారుతో మౌలానాను ఢీకొట్టి అత్యంత దారుణంగా హత్య చేశాడు. మౌలానా మృతి చెందాడనే వార్త తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. హత్యకు పాల్పడిన ఇస్మాయిల్ ఇంటికి వెళ్లిన మౌలానా కుటుంబ సభ్యులు నిప్పంటించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నీళ్లు పోసి మంటల్ని ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఏదైనా సమస్య ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలని, పోలీసులను ఆశ్రయించి న్యాయం పొందాలి కానీ దాడులు చేసుకోవడం, హత్యలకు పాల్పడితే జైలు పాలై కుటుంబాలు రోడ్డున పడతాయని పోలీసులు హెచ్చరించారు. ఇస్మాయిల్ దాడిలో మృతి చెందిన మౌలానాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ రెండు కుటుంబాలను దాడులు చేసుకోవద్దు అని, చట్టప్రకారం ప్రొసీడ్ అవ్వాలని పోలీసులు సూచించారు. About the author Shankar Dukanam జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. Up Next Up Next Up Next Up Next 40కి పైగా స్టేషన్ల పునర్నిర్మాణంతో తెలంగాణ రైల్వేల దశ మారుతుంది: కిషన్ రెడ్డి హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ హైదరాబాద్ మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది ప్రపంచం నేపాల్ వరద: 626 మంది మృతి.. ఇంకా 2400 మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ నిజామాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ కేంద్ర

Original source: telugu.abplive.com
Read more on Kaizer News