పసికూన నమీబియా ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న సౌతాఫ్రికా టీ20 ట్రై సిరీస్‌లో బోణీ కొట్టింది. శనివారం విండ్‌హోక్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. జింబాబ్వే విధించిన 145 పరుగుల టార్గెట్‌ను సఫారీలు 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. డెవాల్డ్ బ్రెవిస్ (32 బంతుల్లో 75 నాటౌట్, 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఓపెనర్లు ప్రిటోరియస్ (22), జోర్డాన్ హెర్మన్ (20) పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవన్స్, బ్లెసింగ్ ముజరబానీ, నైమురి తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (34) టాప్ స్కోరర్ కాగా, మరుమనీ (13 బంతుల్లో 30, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) ఆఖర్లో మెరవడంతో జింబాబ్వే గౌరవప్రదమైన స్కోరును సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో డాన్ జాసెన్ 3 వికెట్లు తీయగా, సుబ్రయెన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో సౌతాఫ్రికా సిరీస్‌లో బోణీ కొట్టగా, తర్వాతి మ్యాచ్ సోమవారం జింబాబ్వే, నమీబియా మధ్య జరగనుంది. Read: ఆసియా క్రీడలకు ముందే బిగ్‌షాక్.. పతకం పోయినట్లే! ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం