ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పెందుర్తి–ఆనందపురం జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తార్ జంక్షన్ వద్ద ఓ కారు ముందున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కారులో ఉన్న డ్రైవర్ బయటకు రాలేకపోయాడు. దీంతో మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు