Kaizer News

Vijaya Sai Reddy | వైఎస్‌ జగన్‌కు వెన్నుపోటుదారుడు

Vijaya Sai Reddy | వైఎస్‌ జగన్‌కు వెన్నుపోటుదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డే : మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

· State - Telangana · ntnews.com

అమరావతి : మాజీ పార్లమెంట్‌ సభ్యుడు విజయ సాయిరెడ్డి ( Vijaya Sai Reddy ) వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి (YS Jagan ), వైసీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ( YCP ) పార్టీలో ప్రస్తుతం నంబర్‌-2 వైఎస్‌ జగన్‌, నంబర్‌-1 సజ్జల రామకృష్ణరెడ్డి అని ఆరోపించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన బహిరంగ లేఖలో అనేక సంచలన, ఆసక్తికర వ్యాఖ్యలు ప్రాదాన్యాన్ని సంతరించుకున్నాయి.వైఎస్‌ జగన్‌కు సజ్జల వెన్నుపోటు పొడుస్తూ ఆయనకు తెలవకుండా టీడీపీతో కలిసి ఎలా పని చేయాలో , ఏ కేసులూ లేకుండా ఎలా చేసుకోవాలో అక్కడ ఉన్న కోటరీ నాయకుడికి తెలిసినంత మరెవరికి తెలియదని సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు చేశారు. నమ్మక ద్రోహి అంటూ తనపై సజ్జల సోషల్‌ మీడియాలో దుష్ప్రచార పోస్టులపై విజయ సాయిరెడ్డి స్పందించారు. తాను నమ్మక ద్రోహినే అయితే ఆనాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్‌తో సంది చేసుకుని, సీబీఐ, ఈడీ చార్జిషీట్‌లో నా పేరు లేకుండా చేసుకునేవాడిని, జగన్‌కు నమ్మకస్తుడిని అనే ఒకే ఒక్క కారణంగా జగన్‌గారితో పాటు ప్రతి చార్జిషీట్‌లో నన్ను ఏ-2గా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేర్చిందని అన్నారు. జగన్‌ 16 నెలలు జైల్లో ఉంటే తనను 15 నెలలు జైల్లో పెట్టారని, నమ్మక ద్రోహం నా రక్తంలో ఉంటే అప్పుడే అప్రూవర్‌గా మారేవాడినని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల తరువాత తనకు సంబంధం లేని లిక్కర్‌ స్కామ్‌లో తనను ఏ-5గా, సీపోర్టు కేసులో ఏ-2గా చేర్చారని తెలిపారు. గడిచిన రెండున్నర ఏళ్ల టీడీపీ పాలనలో సకలశాఖ మంత్రి ( సజ్జల ) పేరు మాత్రం ఇంతవరకు ఏ చార్జిషీట్‌లోనూ లేదని ఆరోపించారు. జగన్‌ను రెండు సంవత్సరాలు నోరు తెరచి ఒక్క మాట మాట్లడలేదని, కోటరీ కారణంగా జరిగిన అవమానాలతో పార్టీ నుంచి బయటక వచ్చానని మరోసారి లేఖలో గుర్తు చేశారు. పార్టీ పెడతానేంటే తనను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. నేరుగా గెలిచేందుకే ప్రజాస్వామ్యబద్దంగా యుద్దం చేస్తానని, అప్పట్లో ప్రభుత్వాన్ని, ఇప్పుడు పార్టీని కబ్జాచేసి జగన్‌ను రోజు మోసం చేస్తూ కోవర్ట్‌ రాజకీయం చేయడం చేత కాదని విజయ సాయిరెడ్డి వెల్లడించారు. జగన్‌ను నమ్మక ద్రోహం చేయలేదు. చేయను. పార్టీలో ఉండి ఎవరు కోవర్టుగా పనిచేస్తున్నారో? ఎవరు నమ్మక ద్రోహం చేస్తున్నారో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆలాలోచన చేసుకోవాలని సూచించారు

Original source: ntnews.com
Read more on Kaizer News