Kaizer News

WhatsApp Tips : వాట్సాప్ స్టోరేజ్ ఫుల్ అవుతుందా? ఈ

WhatsApp Tips : వాట్సాప్ స్టోరేజ్ ఫుల్ అవుతుందా? ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి.!

· Technology · hmtvlive.com

Shorts WhatsApp Tips : వాట్సాప్.. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ దాదాపు అవసరమైన యాప్‌గా మారిపోయింది. చాటింగ్ నుంచి ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, డాక్యుమెంట్లు పంపుకోవడం వరకు ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లను వాట్సాప్ అందిస్తోంది. అయితే ఇదే ఫీచర్లు కొన్ని సందర్భాల్లో మన ఫోన్ స్టోరేజ్‌కు పెద్ద సమస్యగా మారవచ్చు. ముఖ్యంగా మీరు చాలా వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉంటే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. గ్రూపుల్లో ఎవరైనా ఫొటోలు, వీడియోలు లేదా ఇతర మీడియా ఫైల్స్ పంపిన ప్రతిసారీ అవి ఆటోమేటిక్‌గా మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంటాయి. మీరు వాటిని ఓపెన్ చేయకపోయినా, అవసరం లేకపోయినా ఫోన్ స్టోరేజ్ మాత్రం నెమ్మదిగా నిండిపోతుంది. కొంతకాలం తర్వాత ఫోన్‌లో స్టోరేజ్ తక్కువగా ఉందనే నోటిఫికేషన్ రావచ్చు. అప్పుడు అవసరం లేని ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను వెతికి ఒక్కొక్కటిగా డిలీట్ చేయాల్సి వస్తుంది. అయితే అసలు సమస్య వచ్చిన తర్వాత ఫైల్స్ డిలీట్ చేయడం కంటే.. అవి ముందుగానే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా చేయడం చాలా ఈజీ. వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు, ఆడియో ఫైల్స్, డాక్యుమెంట్లు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఆపే సెట్టింగ్ ఉంటుంది. దీన్ని మార్చడం ద్వారా మీకు అవసరం లేని మీడియా ఫైల్స్ ఫోన్‌లోకి ఆటోమేటిక్‌గా రావు. ఈ సెట్టింగ్ మార్చిన తర్వాత మీకు అవసరమైన ఫొటో లేదా వీడియోను మాత్రమే కావాలనుకున్నప్పుడు మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో ఫోన్ స్టోరేజ్‌పై అనవసరమైన భారం తగ్గుతుంది. అన్ని చాట్స్‌కు ఆటో డౌన్‌లోడ్ ఆపాలంటే ఇలా చేయండి ముందుగా మీ ఫోన్‌లో వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్‌లోని సెట్టింగ్స్లోకి వెళ్లాలి. అక్కడ స్టోరేజ్ అండ్ డేటా అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేస్తే మీడియా ఫైల్స్‌కు సంబంధించిన ఆటో డౌన్‌లోడ్ సెట్టింగ్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీడియా ఆటో డౌన్‌లోడ్ అనే విభాగంలో ఫొటోలు, ఆడియోలు, వీడియోలు, డాక్యుమెంట్లు వంటి వివిధ ఫైల్ టైప్స్ కనిపిస్తాయి. మీ అవసరాన్ని బట్టి వీటిలో ఏ ఫైల్స్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కావాలో, ఏవి కావద్దో నిర్ణయించుకోవచ్చు. ఫొటోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా చేయాలంటే ఫొటోస్ ఆప్షన్‌లోకి వెళ్లి నెవర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇదే విధంగా వీడియోలు, ఆడియోలు, డాక్యుమెంట్లకు కూడా ఆటో డౌన్‌లోడ్‌ను ఆపేయవచ్చు. పూర్తిగా ఆపాల్సిన అవసరం లేకపోతే.. ఈ ఆప్షన్ బెటర్ అయితే ప్రతి ఒక్కరూ ఆటో డౌన్‌లోడ్‌ను పూర్తిగా ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంటర్నెట్ డేటా సమస్య కాకపోయినా ఫోన్ స్టోరేజ్ మాత్రమే ఆదా చేసుకోవాలనుకుంటే.. మీ అవసరానికి అనుగుణంగా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఉదాహరణకు మొబైల్ డేటాను ఉపయోగిస్తున్నప్పుడు ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా చేసి.. వై-ఫైకి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే డౌన్‌లోడ్ అయ్యేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మొబైల్ డేటా కూడా ఆదా అవుతుంది. అదే సమయంలో మీకు అవసరమైన మీడియా ఫైల్స్‌ను వై-ఫైలో ఉన్నప్పుడు సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక్క చాట్ లేదా గ్రూప్‌కు మాత్రమే ఆటో సేవ్ ఆపేయొచ్చు అన్ని వాట్సాప్ చాట్స్‌కు ఒకేసారి ఈ సెట

Original source: hmtvlive.com
Read more on Kaizer News