Shorts Phone Repair: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌లను నిత్య జీవితంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు అలాగే ముఖ్యమైన డాక్యుమెంట్లు అన్నీ ఫోన్లలోనే నిక్షిప్తం అయి ఉంటాయి. అయితే కొన్నిసార్లు సాంకేతిక సమస్యల కారణంగా మొబైల్‌ను రిపేర్ సెంటర్‌కు ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇచ్చే సమయంలో వ్యక్తిగత గోప్యత భంగమయ్యే ప్రమాదం ఉంది. టెక్నీషియన్లు వాట్సాప్ చాట్లు, వ్యక్తిగత ఫోటోలను చూసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మొబైల్‌ను రిపేర్‌కు ఇచ్చే ముందు మీ డేటాను సురక్షితంగా ఉంచడానికి కొన్ని సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు. వివిధ కంపెనీల ఫోన్లలో దీనికోసం ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ ఫోన్ అయితే మెయింటెనెన్స్ మోడ్‌ను ఆన్ చేయాలి. వన్‌ప్లస్, ఒప్పో, రియల్‌మీ, పిక్సెల్ ఫోన్లలో రిపేర్ మోడ్ ఎనేబుల్ చేయాలి. అలాగే వివో, నథింగ్, ఐకూ, మోటో ఫోన్ అయితే మల్టిపుల్ యూజర్స్‌లోకి వెళ్లి యాడ్ గెస్ట్‌పై క్లిక్ చేయాలి. ఈ సెట్టింగ్స్ చేయడం ద్వారా మీ వ్యక్తిగత సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. వ్యక్తిగత డేటా భద్రత కోసం ప్రతి ఒక్కరూ ఈ విధానాలను పాటించడం మంచిది. ఫోన్ రిపేర్ ఖర్చులు సుమారు రూ. 5 వందల నుంచి రూ. 3 వేల వరకు ఉండవచ్చు. అయితే డేటా భద్రత కోల్పోతే జరిగే నష్టం ఊహకతీతంగా ఉంటుంది. రిపేర్ సెంటర్‌కు ఫోన్ ఇచ్చే ముందు ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకుని లాక్ చేయడం ఉత్తమం. నిపుణుల సలహాతో భద్రతా చర్యలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడానికి ఈ చిన్న ట్రిక్స్ ఎంతగానో సహాయపడతాయి. 2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను