Kaizer News

గంగ ఒక్కడే.. ప్రాణాలు ఐదు

గంగ ఒక్కడే.. ప్రాణాలు ఐదు

· Entertainment · ntnews.com

శర్వానంద్‌ తాజా చిత్రం ‘భోగి’ నిర్మాణ దశలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. 1960 ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్య కథాంశంతో దర్శకుడు సంపత్‌నంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. శనివారం రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘గంగ ఒక్కడే..ప్రాణాలు ఐదు’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన ఈ పోస్టర్‌ పల్లెటూరి వాతావరణానికి, కుటుంబ బంధాలకు అద్దం పడుతున్నది. ఈ సినిమాలో శర్వానంద్‌ గంగ అనే పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించనున్నారు. స్పెషల్‌ పోస్టర్‌లో హీరో గంగ..తన తోబుట్టువులకు తాటి ముంజలు అందిస్తున్నారు. బలమైన కుటుంబ భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని పోస్టర్‌ని బట్టి అర్థమవుతున్నది. అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, రచన-దర్శకత్వం: సంపత్‌నంది

Original source: ntnews.com
Read more on Kaizer News