Kaizer News

Banaganapalle: SRBC కాలువకు నీటి విడుదల పంటలు వేయవ

Banaganapalle: SRBC కాలువకు నీటి విడుదల పంటలు వేయవద్దు – మంత్రి!

· State - Telangana · hmtvlive.com

Banaganapalle: గోరుకల్లు రిజర్వాయర్ నుండి అవుకు రిజర్వాయర్కు నీటిని విడుదల చేసి గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా వారం రోజులపాటు ఎస్ఆర్బిసి కాలువకు నీటి విడుదల చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎస్ ఆర్ బి సి ఎస్ఇ లక్ష్మణ్ నాయక్ ఈఈ ప్రసాద్ రెడ్డి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఎలినో వో ప్రభావంతో వర్షాలు లేక అల్లాడిపోతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు పెరగాలనే ఉద్దేశంతో నీటిని విడుదల చేస్తున్నాము.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రైతులు ఎస్ఆర్బిసి కాల్వకు నీరు వచ్చాయని పంటలు వేసుకోవద్దని తెలిపారు. ఈ నీళ్లు కేవలం పశువులకు మరియు త్రాగడానికి మాత్రమే వాడుకోవాలని తెలిపారు. రైతులు పంటలు వేసుకోకుండా ఈ వారం రోజులపాటు నీటిని పొదుపు చేస్తూ వాడుకోవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రైతులను కోరారు. కార్యక్రమంలో ఎస్ఆర్బిసి ఏఈలు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News