భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ.. కేసు నమోదు చేసి దర్యాప్తు వలిగొండ, ఆంధ్రప్రభ: వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామానికి చెందిన అశ్వినికి కంచనపల్లి గ్రామానికి చెందిన కొలిచెలిమి మహేష్‌తో 2023లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, వివాహం అనంతరం మహేష్ తరచూ అదనపు వరకట్నం కోసం అశ్వినిని వేధిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగానే మనస్తాపానికి గురైన అశ్విని శనివారం ఉదయం బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు