● వర్షాలు సకాలంలో కురవాలని పోలేరమ్మకు మొక్కులు మార్కాపురం రూరల్: సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పెద్ద యాచవరం గ్రామంలో అల్లూరి పోలేరమ్మ అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేకంగా బండ్లు కట్టారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఆదివారం అమ్మవారి ఆలయానికి కాలినడకన వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు ట్రాక్టర్లతో ఆలయం చూట్టూ ప్రదక్షిణలు చేశారు. కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా ఒక్కటై అమ్మవారి వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు