విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మల్లా ప్రవీణ్ కుమార్, ఆయన భార్య అహల్యతో పాటు వారి ఇద్దరు చిన్నారులు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భార్య, పిల్లలకు తొలుత విషం ఇచ్చి, ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు