Kaizer News

Pendurthi: గుర్రంపాలెంలో రూ.1.75 కోట్లతో అభివృద్ధి

Pendurthi: గుర్రంపాలెంలో రూ.1.75 కోట్లతో అభివృద్ధి పనులు

· State - Telangana · hmtvlive.com

Shorts పెందుర్తి: విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెం పంచాయతీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.1.75 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్లు, జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు, పశువుల షెడ్లు తదితర పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ గుర్రంపాలెం గ్రామంలో రోడ్లు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. రాబోయే ఏడాది కాలంలో గ్రామాల్లో రోడ్లు, కాలువలు, ఇంటింటికీ మంచినీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను మరింతగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తుందని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మౌలిక వసతులు కల్పించినప్పుడే నాయకుడిగా తనకు నిజమైన తృప్తి కలుగుతుందని పంచకర్ల రమేష్ బాబు అన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News