Kaizer News

Veldanda: బొల్లంపల్లిలో చేయూత పెన్షన్ల దరఖాస్తుల ప

Veldanda: బొల్లంపల్లిలో చేయూత పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన!

· State - Telangana · hmtvlive.com

Shorts Veldanda: వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్, ఇరిగేషన్ ఏఈ మాల్యా నాయక్ పాల్గొని నూతన చేయూత పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణ, వార్డు సభ్యులు ధన్సింగ్ నాయక్, అందోజు శిరీష శ్రీనివాసచారి, మాజీ వార్డు సభ్యులు మండలి వెంకటయ్య, చక్రపాణి.వినోద్. పరమేష్. తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News