Kaizer News

Nellore: ఈఏపీసెట్ స్పోర్ట్స్ కోటా సీట్ల కేటాయింపుల

Nellore: ఈఏపీసెట్ స్పోర్ట్స్ కోటా సీట్ల కేటాయింపులో తీవ్ర ఆలస్యం

· Sports · hmtvlive.com

Shorts నెల్లూరు: "AP EAPCET-2026 కౌన్సెలింగ్‌లో స్పోర్ట్స్ కోటా సీట్ల కేటాయింపుపై తీవ్ర ఆలస్యం"– 692 మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన, గౌరవ ముఖ్యమంత్రి తక్షణ జోక్యానికి ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రుల సంఘం (PAAP) విజ్ఞప్తి చేసింది... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని AP EAPCET-2026 స్పోర్ట్స్ & గేమ్స్ కోటా అభ్యర్థులు మరియు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు... ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మొదటి, రెండవ మరియు మూడవ (చివరి) దశలు సెప్టెంబర్ 17, 2026 నాటికి పూర్తయినప్పటికీ, స్పోర్ట్స్ కోటా కింద సీట్ల కేటాయింపును ఇంకా పెండింగ్‌లోనే ఉంచడం శోచనీయం అని అన్నారు..స స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై 2026లోనే పూర్తయినప్పటికీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) నుండి మెరిట్/ప్రయారిటీ జాబితా APSCHE అధికారులకు అందకపోవడమే ఈ పరిస్థితికి కారణం అని అన్నారు. ఇతర కేటగిరీల కౌన్సెలింగ్ పూర్తయినప్పటికీ, దాదాపు 692 మంది ప్రతిభావంతులైన క్రీడాకారుల భవిష్యత్తు తీవ్ర ముప్పులో పడింది. ఇది అధికారుల పరిపాలనా వైఫల్యం మరియు బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని అన్నారు. SAAP అధికారులు తక్షణమే స్పోర్ట్స్ & గేమ్స్ కోటా మెరిట్/ప్రయారిటీ జాబితాను తయారు చేసి విడుదల చేయాలి. ఆమోదించిన జాబితా ఆధారంగా అర్హులైన 692 మంది విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి, సీట్లు కేటాయించాలి. ఆలస్యానికి బాధ్యులైన SAAP మరియు APSCHE అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా కచ్చితమైన క్యాలెండర్, జవాబుదారీతనం రూపొందించాలి. ఈ అంశంపై ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి, SAAP మేనేజింగ్ డైరెక్టర్ కి మరియు APSCHE చైర్మన్/సెక్రటరీ కి వినతిపత్రాలు సమర్పించామని చెప్పారు. ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకుని అర్హులైన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నామని చెప్పారు.. లేని పక్షంలో బాధితుల తరఫున అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నామని అన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News