Kaizer News

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

· State - Telangana · sakshi.com

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు,శ్రావణ మాసం, తిథి: బ.పాడ్యమి ఉ.9.30 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: పూర్వాభాద్ర తె.4.26 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: ఉ.10.25 నుండి 12.03 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.48 నుండి 7.27 వరకు, అమృత ఘడియలు: రా.8.14 నుండి 9.54 వరకు. సూర్యోదయం : 5.48 సూర్యాస్తమయం : 6.15 రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం... సోదరులతో సఖ్యత నెలకొంటుంది. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. కార్యజయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. వృషభం... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. మిత్రులు, బంధువుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. ఇంటర్వ్యూలు రాగలవు.. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. మిథునం... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. మిత్రులతో కలహాలు. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు. కర్కాటకం... వ్యవహారాలలో అవరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా కొనసాగుతాయి.. సింహం... ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. బంధువులతో తగాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కన్య... దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆలయ దర్శనాలు. ఆస్తిలాభం. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. తుల... కొత్త రుణాలు చేస్తారు. శ్రమానంతరం పనులు పూర్తి. మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. కళాకారుల యత్నాలు ఫలిస్తాయి. వృశ్చికం... ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ధనుస్సు... నూతన వ్యక్తుల పరిచయం. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. మకరం... ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. కుంభం... నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖుల పరిచయం. ముఖ్య సమాచారం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. మీనం... కొన్ని కార్యక్రమాలు మధ్యలో వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత సామాన్యంగా ఉంటాయి. హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు.. చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా

Original source: sakshi.com
Read more on Kaizer News