న గరం చీకటి దుప్పటి కప్పుకున్న వేళ... అక్కడ హాలోవీన్ వేడుకలు మొదలయ్యాయి. వ్యాపారవేత్త చేతన్ విల్లా అంతా వింత ఆకారాలు, భయంకరమైన అలంకరణలతో నిండిపోయింది. మోడల్ నమిత, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ మిత్రా, జర్నలిస్ట్ శుక్లా, నమిత స్నేహితురాలు వినతి, రమ్య అక్కడ చేరారు. అందరూ విభిన్నమైన ఫ్యాన్సీ డ్రెస్సుల్లో, ముసుగుల్లో ఉన్నారు. నమిత తెల్లటి దుస్తుల్లో ప్రేతాత్మలా భ్రమను కలిగిస్తోంది. వేడుక పీక్స్‌కి చేరింది. అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు హారర్ ఎఫెక్ట్ కోసం ఇంట్లోని లైట్లన్నీ ఆపేశారు. ఐదు నిమిషాల పాటు అంతా కారుచీకటి. కేవలం భయంకరమైన నవ్వుల సౌండ్ ట్రాక్ మాత్రమే వినిపిస్తోంది. సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత లైట్లు ఆన్ అయ్యాయి. ఒక్కసారిగా అక్కడ కనిపించిన దృశ్యానికి అందరూ షాకయ్యారు. హాల్లో ఉన్న సోఫాపై నమిత నిర్జీవంగా రక్తం మడుగులో పడి ఉంది. ఆమె గుండెల్లో పదునైన కత్తి దిగి ఉంది. ఆ గదిలో మంత్రాల్లా గోడపై రక్తం గుర్తులు రాసి ఉన్నాయి. అక్కడి వారంతా ఇది ‘ఆత్మ చేసిన హత్య’ అని ప్రచారం మొదలుపెట్టారు. ∙∙ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అభిమన్యు రంగంలోకి దిగాడు. మీడియాలో ‘హాలోవీన్ రాత్రి ఆత్మ చేసిన హత్య’ అంటూ అప్పటికే రూమర్స్ మొదలయ్యాయి. రక్తం మడుగులో నమిత– లక్షలాది మంది మగవాళ్ల హార్ట్ బీట్. తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న మోడల్. డెడ్ బాడీని పోస్ట్‌మార్టమ్‌కు పంపి, అక్కడ ఉన్న ఐదుగురినీ విచారించడం ప్రారంభించాడు ఇన్‌స్పెక్టర్ అభిమన్యు. డైరెక్టరు మిత్రా తన తదుపరి యాడ్ ఫిలింలో చేయమని నమితను కోరితే, ఆమె చేయనంది. అతనికి నమిత మీద పీకల దాకా కోపం వుంది. జర్నలిస్ట్ శుక్లా– నమితకు కెరీర్ మొదట్లో సాయం చేసి, ఫేమస్ చేశాడు. కానీ స్టార్ అయ్యాక నమిత అతన్ని దూరం పెట్టడంతో లోలోపల రగిలిపోతున్నాడు. బిజినెస్‌మేన్ చేతన్ నమితను పిచ్చిగా ప్రేమించి ప్రపోజ్ చేశాడు. నమిత అతని ప్రపోజల్‌ను తిరస్కరించింది. అతని ఈగో దెబ్బతింది. ఇక వినతి, రమ్యలకు పెద్దగా మోటివ్స్ లేవు. అభిమన్యు నోటీసులోకి రెండు విషయాలు వచ్చాయి. ఒకటి, నమిత గుండెల్లో దిగిన కత్తిని కుడిచేత్తో బలంగా పొడిచారు. రెండు, లైట్లు ఆపే సమయానికి, ఆన్ అయ్యే సమయానికి అందరూ ఒకే చోట ఉన్నారా లేదా? అభిమన్యు క్రైమ్ సీన్ ను పరిశీలించాడు. గోడపై రాసిన రక్తపు గుర్తులు ఆత్మ చేసిందిగా నమ్మించడానికి కావాలనే రాసినట్టు అర్థమైంది. హాల్‌లోని స్మార్ట్ హోమ్ లైటింగ్ సిస్టమ్ డేటాను ఫోరెన్సిక్ టీమ్ పరిశీలించింది. లైట్లు స్విచ్ బోర్డు నుండి కాకుండా, మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ అయినట్లు గుర్తించింది. అభిమన్యు అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి. ‘లైట్లు పోయిన ఆ ఐదు నిమిషాలు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు?’ అని అడిగాడు. మిత్రా తాను స్విచ్ బోర్డు వైపు వెళ్లానని చెప్పాడు. చేతన్ తను అక్కడే వున్నానని చెప్పాడు. లైట్లు ఆఫ్‌లో ఉండటం వాళ్ళ సీసీ కెమెరాలు పని చేయలేదు. అందరి మొహాల్లో టెన్షన్– పోలీసులు సంకెళ్లతో సిద్ధంగా ఉన్నారు. బయట మీడియా హడావుడి. . ∙∙ అక్కడ అంతా నిశ్శబ్దం. అభిమన్యు పోలీసుల వైపు చూశాడు. ‘మిస్టర్ మిత్రా! పదండి’ అన్నాడు. ‘ఎందుకు? మిత్రా అడిగాడు. ‘నమితన