Kaizer News

Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్ర

Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు

· National - India · ntvtelugu.com

shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అస్వస్థత అధికారిక కార్యక్రమాలు రద్దు వైద్యుల సూచన మేరకు ఢిల్లీలో విశ్రాంతి Follow Us : --> Add as a preferred source on google కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కర్ణాటక, మహారాష్ట్రలో అధికారిక కార్యక్రమాలు రద్దయ్యాయి. అస్వస్థత కారణంగా హుబ్బిళ్లి నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కొల్హాపూర్ పర్యటన కూడా రద్దైంది. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి కోసం ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈరోజు, రేపు అమిత్ షా మహారాష్ట్ర, కర్ణాటకలో పర్యటించాల్సి ఉంది. హుబ్బిళ్లి, కొల్హాపూర్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో హుబ్బిళ్లి నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లిపోయారు. వాస్తవంగా హుప్రిలోని కల్లప్పన అవడే జవహర్ షెట్కారి సహకారి షుగర్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో మహాలక్ష్మి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ‘జీరో వేస్ట్’ ‘వేస్ట్ టు బెస్ట్’ అనే ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 600 కోట్లు కేటాయించారు

Original source: ntvtelugu.com
Read more on Kaizer News