Kaizer News

అది ఎవరు.. శమంతకమణి.. ది మిస్టరీస్‌ ఆఫ్‌ ద్వారకా-5

అది ఎవరు.. శమంతకమణి.. ది మిస్టరీస్‌ ఆఫ్‌ ద్వారకా-5

· State - Telangana · ntnews.com

మొదటి పెట్టె ముందు సరైన సమాధానం చెప్పడంతో అందులో ‘గోమేధికం’ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకొన్న డిటెక్టివ్‌ రుద్ర రెండో పెట్టె మీద ఉంచాడు. దీంతో రెండో పెట్టెపై ఇలా రాసి ఉంది. ‘ఈ ప్రశ్నకు తొమ్మిది నిమిషాల్లో సరైన సమాధానం చెప్పాలి. లేకపోతే, ఈ పెట్టె నుంచి వచ్చే భీకర శబ్దంతో మీ కపాలాలు ఛిద్రమైపోతాయి. ఇది తథ్యం’ అని రాసి ఉంది. సరేనని రెండో పెట్టెను చేతితో రుద్ర మూడు సార్లు తడిమాడు. అంతే, రెండో ప్రశ్న కనిపించింది. ‘ఒక సంచీలో 10 బంగారు నాణేలు ఉన్నాయి. చివరకు ఏమీ మిగలకుండా 10 మంది ఒక్కొక్కరూ ఒక్కో నాణేన్ని తీసుకొన్నారు. అయినా సంచీలో ఒక నాణెం మిగిలిపోయింది. ఎలా?’ అంటూ ప్రశ్న కనిపించింది. ప్రశ్నను వినగానే రామస్వామి గుండెలు గుభేలుమన్నాయి. ఇదేం ప్రశ్నరా బాబూ.. అనుకుంటూ ఉండగానే.. రుద్ర సరైన సమాధానం చెప్పాడు. ఆ వెంటనే రెండో పెట్టె తెరుచుకొని అందులో ‘మాణిక్యం’ కనిపించింది. దాన్ని తీసుకొని మూడో పెట్టె మీద ఉంచాడు రుద్ర. 8 నిమిషాల డెడ్‌లైన్‌తో మూడో ప్రశ్న కనిపించింది. ‘ఒక గదిలో 5 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. గాలి వీయడంతో రెండు కొవ్వొత్తులు ఆరిపోయాయి. కాసేపటి తర్వాత ఎన్ని కొవ్వొత్తులు ఆ గదిలో మిగిలి ఉంటాయి?’ అన్న ప్రశ్నకు రుద్ర కరెక్ట్‌గా సమాధానం ఇవ్వడంతో మూడో పెట్టె తెరుచుకొని అందులోంచి ‘ముత్యం’ బయటపడింది. దాన్ని తీసుకొని నాలుగో పెట్టె మీద ఉంచాడు రుద్ర. 7 నిమిషాల డెడ్‌లైన్‌తో నాలుగో ప్రశ్న కనిపించింది. ‘ఒక గంట మూడు సార్లు మోగడానికి రెండు సెకండ్లు సమయం పడుతుంది. అదే గంట ఆరు సార్లు మోగడానికి ఎన్ని సెకండ్ల సమయం పడుతుంది?’ అన్న నాలుగో ప్రశ్నకు కూడా రుద్ర కరెక్ట్‌గా సమాధానం చెప్పాడు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా రుద్ర కరెక్ట్‌గా సమాధానాలు చెప్తుండటాన్ని చూసిన ధరణి టీమ్‌ ఆశ్చర్యపోయింది. టీమ్‌ లీడ్‌ రుద్ర తెలివితేటలను చూస్తూ జయ, కరణ్‌, రామస్వామి, స్నేహిల్‌, హరిశ్వ మురిసిపోతున్నారు. నాలుగో ప్రశ్నకు కరెక్ట్‌గా సమాధానం చెప్పడంతో నాలుగో పెట్టె తెరుచుకొని అందులో ‘పగడం’ కనిపించింది. దాన్ని తీసుకొన్న రుద్ర ఐదో పెట్టెపై ఉంచాడు. 6 నిమిషాల డెడ్‌లైన్‌తో ఐదో ప్రశ్న కనిపించింది. ‘ఒక బావి 20 మీటర్ల లోతుతో ఉంది. ఒక కప్ప నిమిషానికి 5 మీటర్ల పైకి ఎక్కి, 4 మీటర్లు జారుతుంది. అలా ఆ కప్ప ఎన్ని నిమిషాల్లో బావి నుంచి బయటపడగలదు?’ అన్న ఐదో ప్రశ్నకు రుద్ర కరెక్ట్‌గా సమాధానం చెప్పాడు. దీంతో ఐదో పెట్టె తెరుచుకొని అందులో ‘మరకతం’ కనిపించింది. దాన్ని తీసుకొని ఆరో పెట్టె మీద రుద్ర పెట్టగానే కొన్ని అక్షరాలు కనిపించాయి. ‘ఇప్పుడు అడగబోయే ప్రశ్నకు ఎన్నో సమాధానాలు ఉన్నాయి. వాటిలో కనీసం రెండు సరైన సమాధానాలు చెప్తే, తర్వాతి రెండు పెట్టెలు అంటే ఆరు, ఏడు పెట్టెలు ఒకదాని వెనుక ఒకటి తెరుచుకొంటాయి. తప్పు సమాధానం చెప్తే.. ఈ పెట్టెల నుంచి వచ్చే భీకర శబ్దంతో మీ కపాలాలు ఛిద్రమైపోతాయి. ఇది తథ్యం. మీకు ఇచ్చే సమయం ఐదు నిమిషాలు’ అని రాసి ఉంది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తుండగానే ఆరో పెట్టెను, ఏడో పెట్టెను ఏకకాలంలో రుద్ర మూడుసార్లు తడిమాడు. రెండు పెట్టెలపై ఒకే విధంగా ఆరో ప్రశ్న ఇలా కనిపించింది. ‘పుట్టి భూమిపై పడగానే ప్రాణం ఉండదు. అయిత

Original source: ntnews.com
Read more on Kaizer News