Kaizer News

రాజకీయ కక్షతోనే కేసీఆర్‌ నివాసంలో సర్వే

రాజకీయ కక్షతోనే కేసీఆర్‌ నివాసంలో సర్వే

· State - Telangana · ntnews.com

రేవంత్‌ భూములపై కూడా విచారణ జరిపించాలి: జాన్‌ వెస్లీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ): శాసనసభ వేదికగా 22ఏ నిషేధిత భూములు, ‘ధరణి’ అక్రమాలు, భూ కబ్జాలపై ప్రభుత్వం ఆదేశించిన విచారణ కేవలం అరకొర చర్యలు, రాజకీయ కక్షసాధింపులతో సరిపెట్టకుండా పారదర్శకంగా జరుపాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో కేసీఆర్‌ నివాసంలో సర్వేలు జరుపకుండా, అధికార కాంగ్రెస్‌, బీజేపీ ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ల ఆధీనంలో ఉన్న అక్రమ అసైన్డ్‌, భూదాన్‌, వక్ఫ్‌, ఫారెస్ట్‌ భూములన్నింటిపై తక్షణమే విచారణ చేసి, వాటిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబానికి కొండూరు, కొండారెడ్డిపల్లి గ్రామాల్లోని 308 ఎకరాల భూమి, ఆయన సోదరుడి ‘టెస్సరాక్ట్‌’ కంపెనీకి తకువ ధరకే రూ. 200 కోట్ల విలువైన భూముల కేటాయింపు, 22ఏ మినహాయింపుల పేరుతో 30% కమీషన్లపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు

Original source: ntnews.com
Read more on Kaizer News