Kaizer News

మాచన రఘునందన్ కు అరుదైన గౌరవం.. ఎయిమ్స్‌ నుంచ ఆహ్వ

మాచన రఘునందన్ కు అరుదైన గౌరవం.. ఎయిమ్స్‌ నుంచ ఆహ్వానం

· City - Hyderabad · ntnews.com

బచ్చన్నపేట, ఆగస్టు 31 : అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏయిమ్స్) నిర్వహించనున్న ఓ సదస్సుకు హాజరు కావాల్సిందిగా తనకు ఆహ్వానం అందిందని టుబాకో కంట్రోల్ ‘హీరో’ మాచన రఘునందన్ తెలిపారు. సెప్టెంబర్ 5న ఏయిమ్స్ లో జరిగే సదస్సుకు హాజరు కావాలని డాక్టర్ దత్తా కోరినట్టు మాచన రఘునందన్ తెలిపారు. సోమవారం రఘునందన్ బచ్చన్న పేట లో మాట్లాడుతూ..ఏటా రెండు పర్యాయాలు ఎయిమ్స్ నుంచి తనకు ఆహ్వానం వస్తుందని వివరించారు. స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ (SIPHER) వారు టుబాకో కంట్రోల్ హీరో అవార్డుకు తనను ఎంపిక చేసినపుడు.. అందుకు తన అర్హత, యోగ్యత ల తో పాటు.. ఎయిమ్స్ వైద్యులు కూడా నామినేట్ చేశారని చెప్పారు. దేశ వ్యాప్తంగా పాఠశాలలు కళాశాల్లో విద్యార్ధులకు పొగాకు నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి వాటిలో తన భాగస్వామ్యం కోసం ఎయిమ్స్ ప్రతిపాదించే అవకాశం ఉందని రఘునందన్ ఆశా భావం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో..500 గ్రామాలు పర్యటించి,5000 కిలో మీటర్ల ప్రయాణం ద్వారా 50,000 మందికి పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాలను వివరించి ‘సే నో టు టుబాకో’ అనేలా చేయగలిగానన్నారు. ఈ అసాధారణ కృషిని గుర్తించి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ సదస్సు కు హాజరు కావాలని సమాచారం పంపిందని తెలిపారు

Original source: ntnews.com
Read more on Kaizer News