బందరు కాలువలోకి దూకిన యువతి.. మృతదేహం కోసం గాలింపు పెనమలూరు, ఆంధ్రప్రభ : పెనమలూరు వంతెనపై మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి వంతెనపై నుంచి బందరు కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతురాలు పెనమలూరుకు చెందిన అనూషగా స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలువలో గల్లంతైన యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఘటనాస్థలిని ఉయ్యూరు ఆర్డీవో సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. యువతి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాయి. కాలువలో నీటి ప్రవాహం, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గాలింపు కొనసాగుతోంది. మృతదేహం లభించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వరుస ఘటనల నేపథ్యంలో వంతెన వద్ద భద్రతా చర్యలు చేపట్టి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు