Elkathurthy: హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలంలోని ఇందిరా నగర్ గ్రామాన్ని ఎలకతుర్తి మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా శనివారం ఇందిరా నగర్ గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల సమక్షంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరా నగర్ గ్రామంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందని మంత్రి తెలిపారు. 44 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, చాలావరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలో రెండో దశలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి. 96 మందికి పెన్షన్లు అందుతున్నాయి. వీటి కోసం రూ.6.32 లక్షలు విడుదల చేస్తున్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా 66 కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.10.08 లక్షల లబ్ధి చేకూరింది. మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ ద్వారా 15 కుటుంబాలకు రూ.7.27 లక్షలు విడుదలయ్యాయి. 20 మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.10.09 లక్షలు విడుదలయ్యాయి. 41 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.6.20 కోట్ల రుణాలు అందాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మూడు మహిళా సంఘాలకు 300 స్టీల్ బ్యాంక్ కిట్లు, 13 రకాల వస్తువులతో అందించారు. 52 మంది రైతులకు రూ.37.61 లక్షల రైతు రుణమాఫీ లబ్ధి చేకూరింది. 235 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.93.04 లక్షలు అందాయి.మంది రైతులకు సన్న వడ్ల బోనస్ కింద రూ.10.57 లక్షలు విడుదలయ్యాయి. 6 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందించారు. గ్రామంలో 69 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. 382 రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. ఇందిరా నగర్ గ్రామం ఇందిరా గాంధీ పేరు మీద ఏర్పడిన గ్రామం కావడం తనకు ప్రత్యేక గౌరవంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రామ ప్రజలు కోరిన విధంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో కొన్ని సమస్యలు పేరుకుపోయాయని, ఇకపై సంక్షేమం, అభివృద్ధి రెండూ ప్రతి అర్హ కుటుంబానికి సమానంగా అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, గ్రామపంచాయతీ భవనం, మహిళా సంఘ భవనం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జలసిరి పథకం కింద ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. ఒక్కో ఇంకుడు గుంతకు ప్రభుత్వం రూ.6,500, పొలం కుంటకు రూ.1.30 లక్షలు అందిస్తుందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో