Kaizer News

Kurnool: కర్నూలు జీజీహెచ్‌లో స్వచ్ఛాంధ్ర - స్వర్ణా

Kurnool: కర్నూలు జీజీహెచ్‌లో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం

· State - Telangana · hmtvlive.com

Shorts కర్నూలు : ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వచ్ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు ప్రతిజ్ఞ చేసి, ఆసుపత్రికి వచ్చిన ప్రజలతో కలిసి న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్‌ ముందు మొక్కలు నాటారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వచ్ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఆసుపత్రి పరిసరాలల్లో ఎక్కడ కూడా చేత వేయరాదని డస్ట్ బిన్స్ లో మాత్రమే వెయ్యాలి అని మరో సారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గారితో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ డా లక్ష్మీ భాయ్ డిప్యూటీ CSRMO డా వి. పద్మజ మరియు ఇతర ఆసుపత్రి అధికారులు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News