రేగొండ, ఆంధ్రప్రభ : ఎండ తీవ్రత కారణంగా అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన కోడూరి రాజమౌళి ఆదివారం మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. గుండెపోటుకు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు రాజమౌళిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. రాజమౌళి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు